సాంకేతికతను అందిపుచ్చుకోవడం అందరికి సాధ్యం కావటంలేదు. కొందరు బానిసలైపోతుంటే, ఇంకొందరు దానికి దూరంగానే ఉండి బ్రతికేస్తున్నారు. ఫేస్ బుక్ సహా పలు సామజిక మాధ్యమాలలో రోజురోజుకు మోసాల సంఖ్య పెరిగిపోతుంది. అంటే ఏ సాంకేతికతను అయినా కూడా వాడుకోవడం లో అసలు సమస్య ఉంటుంది. సరైన మార్గంలో వాడుకుంటే అనేక అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. లేని పక్షంలో సమస్యలకు గురికావాల్సి వస్తుంది. ఈ తరం ఎక్కువ కాలం సామజిక మాధ్యమాలలో ఉండటం చూస్తూనే ఉన్నాం. చదువు సరిగా రాకపోయినా నేటి తరానికి సామజిక మాధ్యమాలలో అనేక విషయాలు తెలుస్తున్నాయి.

అందుకే ఈ సామజిక మాధ్యమాలలో మోసపోతున్న వారిలో యువకులే ఎక్కువ ఉన్నారు. రోజు అనేక మంది ఈ మోసాలకు గురి అవుతున్నారు. కొందరు ధైర్యంగా ముందుకు వచ్చి ఆయా మోసాల గురించి చెప్పుకుంటుంటే, మరి కొందరు మాత్రం మౌనంగా రోదిస్తూనే ఉన్నారు. దీనికోసమే రక్షణ వ్యవస్థ లో సైబర్ క్రైమ్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా అధికారులు కూడా ఆయా సామజిక మాధ్యమాలలో మోసాలను కనుక్కోడానికి కృషి  చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ఇచ్చిన ఫిర్యాదుల మేరకు స్పందించి, అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఛేదించారు.

తాజాగా ఒక ఇంటర్మీడియట్ పూర్తి చేసిన యువకుడు ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన వ్యక్తులకు కాలేజీ సీటు ఇప్పిస్తా అంటూ మోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వీళ్లు ఫేస్ బుక్ లో అమ్మాయిలను పరిచయం చేసుకొని కళాశాలలో సీట్లు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేస్తున్నారు. ఇలా రెచ్చిపోతున్న వీళ్ళను అధికారులు తెలివిగా పట్టుకొని విచారిస్తున్నారు. దాదాపు ఈ నేరాల అన్నిటికి మూల కారణం ఈజీగా డబ్బు సంపాదించడమే అనేది అధికారులు చెపుతున్నారు. ఎక్కడో ఊరి నుండి సిటీకి వచ్చి, కేటరింగ్ చేసుకుంటూ, జల్సాలకు డబ్బు కావాలి కాబట్టి వీళ్లంతా ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నట్టు వారు తెలిపారు. వీళ్లు ముందు పరిచయం చేసుకుంటారు అనంతరం ప్రేమ అంటారు తరువాత సమయం చూసి డబ్బులు గుంజుతారు. తరువాత కాలేజీ లో సీటు ఇప్పిస్తా అంటూ 46వేలు వసూలు చేశాడు. కాలం గడుస్తున్నా ఆ అమ్మాయికి సరైన సమాధానం లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. దీనితో డొంక కదిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: