హాలీవుడ్ సూపర్ హీరో మూవీ 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' ఆధారంగా అనుమానాస్పద లింక్‌ల ద్వారా ఇంటర్నెట్ స్కామర్లు ప్రజలను మోసగించి వారి బ్యాంక్ వివరాలను దొంగిలిస్తున్నారని సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు శుక్రవారం ప్రజలను హెచ్చరించారు. Kaspersky పరిశోధకులు ఈ మూవీ ప్రీమియర్‌కు ముందు స్కామర్‌ల కదలికలను ట్రాక్ చేసారు. వీక్షకుల బ్యాంక్ వివరాలను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్న అనుమానాస్పద వెబ్‌సైట్‌ల లింక్ లను కనుగొన్నారు.

వాస్తవానికి ప్రీమియర్‌కు ముందు కొత్త సూపర్ హీరో చిత్రాన్ని చూడటానికి ప్రజలను తమ క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని లింక్ ద్వారా నమోదు చేయవలసిందిగా కోరారు. చాలా మంది వినియోగదారులు అదే చేసి మోసపోయారు. ఆ తర్వాత వారి కార్డ్ నుండి డబ్బు డెబిట్ అయ్యింది. కానీ వారు సినిమాను ముందుగా చూసే అవకాశం లేదు. సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ మాట్లాడుతూ తాజా స్పైడర్ మ్యాన్ చిత్రం విడుదలపై అభిమానులు చాలా ఉత్సుకతతో ఉన్నారని, దీనిని సద్వినియోగం చేసుకుని సైబర్ నేరగాళ్లు వీక్షకుల అజాగ్రత్తను వాడుకుంటున్నారని అన్నారు. 'నో వే హోమ్' ప్రీమియర్ సాకుతో ఆన్‌లైన్ ఎక్స్‌పోజర్ మరియు అనుమానాస్పద పేజీల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

సూపర్ హీరోల సినిమాలు ఎప్పుడూ అభిమానుల నుండి చాలా దృష్టిని ఆకర్షిస్తాయి. కొన్ని నివేదికల ప్రకారం 'నో వే హోమ్' గురించి ఇంటర్నెట్‌లో అనేక ఊహాగానాలు మరియు పుకార్లు ఉన్నాయి. ఉదాహరణకు, టోబే మాగైర్ మరియు ఆండ్రూ గార్‌ఫీల్డ్ ఇద్దరూ తమ తమ చిత్రాల నుండి స్పైడర్ మాన్‌గా తిరిగి వస్తున్నారని నివేదికలు ఉన్నాయి. అనుమానాస్పద పేజీపై ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మోసగాళ్లు సినిమా అధికారిక పోస్టర్‌లను ఉపయోగించరు. కానీ స్పైడర్ మ్యాన్ నటుల అభిమానుల అభిమానాన్ని ఉపయోగించారని నివేదిక పేర్కొంది. చాలా సందర్భాలలో ఇతర అవాంఛిత ప్రోగ్రామ్‌లను ఇన్‌స్టాల్ చేసే మూవీ డౌన్‌లోడర్‌ని కాస్పెర్స్కీ పరిశోధకులు కనుగొన్నారు. కానీ ఇతర యాడ్‌వేర్ , ట్రోజన్‌లను కూడా మోసం చేయడానికి ఉపయోగిస్తున్నారు. వినియోగదారులు వారు సందర్శించే పేజీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ధృవీకరించని సైట్‌ల నుండి ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని మేము సలహా ఇస్తున్నాము అని Kaspersky భద్రతా నిపుణుడు Tatyana Schcherbakova అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: