ఇకపోతే ఎప్పటిలాగే ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన కస్టమర్లకు పండుగ ముందే ఒక శుభవార్తను అందించింది. ఇక ఇది వారికి ఒక స్పెషల్ గిఫ్ట్ లాంటిదని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రీపెయిడ్ కస్టమర్లకు ఉచితంగా 5 GB డేటాను అందిస్తోంది. ఇకపోతే ఎవరైతే ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకుంటారో వారికి ఈ ఉచిత డేటా ఆఫర్ వర్తిస్తుంది అని ఎయిర్టెల్ స్పష్టం చేసింది. దేనినైనా మనం ఉచితంగా పొందుతున్నాము అంటే కచ్చితంగా అందుకు సంబంధించిన నియమ నిబంధనలు కూడా మనం పాటించాల్సి ఉంటుంది. ఏది కూడా ఉచితంగా రాదు కదా..

ఇక ఈ క్రమంలోనే ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ను మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు.  ఇక ఈ యాప్ ద్వారా ఎన్నో రకాల సేవలను కూడా పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ 5g డేటా ఒకేసారి లభించదు..  ఇక్కడ కూడా ఎయిర్టెల్ ఒక ఫిట్టింగ్ పెట్టిందని చెప్పవచ్చు. ఈ 5GB డేటా ఒకేసారి లభించకుండా ఐదు కూపన్ ల రూపంలో మీకు లభిస్తుంది.  ఒక్కొక్క కూపన్ లో ఒక జీబీ డేటా లభిస్తుంది. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, బిల్ పేమెంట్స్ ప్లాన్ మార్చుకోవడం ఇంకా ఇతర సర్వీసులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే కొత్తగా ఎయిర్టెల్ ప్రీపెయిడ్ సిమ్ కార్డు కొన్న వారు కూడా ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని , రిజిస్టర్ చేసుకుంటే ఇలా 5GB డేటాను ఐదు కూపన్ లో పొందవచ్చు.

రిజిస్టర్ చేసుకున్న తర్వాత కస్టమర్లు కూపన్ సెక్షన్ లోకి వెళ్లి, ఈ  ఉచిత డేటాను పొందవచ్చు. ఇకపోతే 90 రోజుల్లోపు ఈ కూపన్ మీరు క్లైమ్ చేసుకోవాల్సి ఉంటుంది.  లేకుంటే అవి వేస్ట్ అయిపోతాయి. ఇక ఎయిర్టెల్ కస్టమర్లకు పండగ లాంటి ఆఫర్ ప్రకటించడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: