కారు మైలేజీని ఎలా పెంచుకోవాలో తెలుసుకోవడం చాలా అవసరం. అయితే నేడు మనం నిత్యం మనకు ఎదురయ్యే ఈ మైలేజ్ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇందులో బాగా ముఖ్యమైనది.. కారును సరైన సమయానికి సర్వీస్ చేయడం. కారుని సరైన సమయానికి సర్వీస్ చేయకపోతే.. అది మనం  ముఖ్యమైన పనిపై వెళ్తున్నప్పుడు చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి, మీ కారు కనుక తక్కువ మైలేజీని ఇస్తుంటే.. ముందుగా దానిని సర్వీస్ చేయించాలనే విషయం గుర్తు పెట్టుకోండి.ఎందుకంటే సర్వీస్ చేస్తే మాత్రమే కారు సరైన పద్దతిలో మైలేజ్ ని ఇస్తుంది.ఇంకా అలాగే కారు పనితీరుకు రెగ్యులర్ సర్వీస్ కూడా చాలా అవసరం. ఇది మంచి మైలేజ్‌ ఇవ్వడానికి బాగా సహాయపడుతుంది. క్లీన్ ఎయిర్ ఫిల్టర్ ఇంకా ఫ్యూయల్ ఫిల్టర్ మీ కారు ఇంధన మైలేజీని కూడా పెంచుతాయి.ఒకవేళ ఎయిర్ ఫిల్టర్ కనుక సరిగ్గా లేకుంటే ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుందని మీరు గుర్తుంచుకోండి.ఇక ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే ప్రదేశంలో మీరు కారు డ్రైవ్ చేస్తున్నట్లైతే.. సిగ్నల్ పడిన వెంటనే ఇంజన్ ని ఆపేయండి.


రోడ్డు పక్కన షాపింగ్ చేస్తున్న సమయంలో కూడా మీ కారును పార్కింగ్ ప్లేస్‌లో పెట్టి.. ఇక షాపింగ్ చేయండి. ఎందుకంటే కారు ఆన్‌లో ఉండగా షాపింగ్ చేయడం వల్ల మైలెజ్ అనేది తగ్గిపోతుంది.ఇంకా అలాగే మీరు లాంగ్ డ్రైవ్‌ కి వెళ్తున్నప్పుడు మీరు క్రూయిజ్ కంట్రోల్ ఉపయోగించవచ్చు. అయితే, మీరు ప్రయాణించే రహదారిపై క్రూయిజ్ కంట్రోల్ వాడొచ్చో లేదో గుర్తుంచుకోండి. ఒకేవేళ వాడుకోగలిగితే అలా చేయండి. ఎందుకంటే ఇది మీకు ఎక్కువ మైలేజీని ఇవ్వడంలో బాగా సహాయపడుతుంది.ఇక మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వివేకంతో డ్రైవ్ చేయండి. మితిమీరిన వేగం ఇంకా అనవసరమైన యాక్సిలరేషన్ అలాగే అసందర్భ బ్రేకింగ్‌లను తగ్గించుకోగలిగినట్లయితే.. ఇంధన వినియోగం తగ్గి మైలేజ్ అనేది పెరుగుతుంది. హైవేలపై ఎక్కువ వేగంతో వెళ్లటం వలన మీరు సుమారు 30 శాతానికి పైగా మైలేజ్‌ను కోల్పోవటం జరుగుతుంది. ఇంకా అలాగే, ట్రాఫిక్ ఉన్న ప్రదేశాల్లో అనవసరంగా బ్రేకులు వేయడం ఇంకా యాక్సిలరేషన్ కారణంగా సుమారు 5 శాతం మైలేజ్‌ తగ్గడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: