ప్రపంచ వ్యాప్తంగా కూడా యాపిల్ బ్రాండ్ కి కొన్ని లక్షల అభిమానులు ఉన్నారు. ఈ డిమాండ్ కు తగ్గట్లు యాపిల్ కంపెనీ కూడా అప్డేటెడ్ ఫీచర్లను వినియోగదారులకు అందిస్తూ తన బ్రాండ్ ప్లేస్ ని మార్కెట్లో నెంబర్ వన్ గా పదిలం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తన మొదటి ఫోల్డబుల్ ఐ ప్యాడ్ ను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.వచ్చే సంవత్సరం దీన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు అంతా రెడీ చేస్తోంది. ఇది కార్బన్ ఫైబర్ కిక్ స్టాండ్ తో రానునున్నట్లు సమాచారం తెలుస్తోంది.ఇక ఫోల్డబుల్ ఐప్యాడ్ లాంచ్ తేదీ, ఫీచర్స్ ఇంకా అలాగే స్పెసిఫికేషన్స్‌కు సంబంధించిన వివరాలను యాపిల్ కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ ఐప్యాడ్ ఫోల్డబుల్‌లో కార్బన్ ఫైబర్ కిక్‌స్టాండ్‌ ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో దీని ధర కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కార్బన్ ఫైబర్ మెటీరియల్ కారణంగా ఈ హ్యాండ్‌సెట్ బరువు తక్కువగా ఇంకా అలాగే ఎక్కువకాలం చాలా మన్నికగా ఉంటుందట.


అలాగే ఐప్యాడ్‌ల రవాణాను కూడా ఇది సులభతరం చేస్తుందట.ఇక ఈ ప్రోడక్ట్ కు సంబంధించిన ఇతర ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్స్‌పై రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.మరి చూడాలి ఇది వినియోగదారులను ఎంత మాత్రం ఆకట్టుకుంటుందో.అయితే ఐప్యాడ్ మినీతో పోలిస్తే ఐప్యాడ్ ఫోల్డబుల్ అనేది చాలా ఖరీదైనది. వీటికి ఒకదానితో మరో ప్రొడక్ట్‌కు సంబంధం లేదు.అయితే రాబోయే న్యూ ఐప్యాడ్ మినీలో కొత్త ప్రాసెసర్ అనేది చాలా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందట. ఇంకా అది సెల్లింగ్ పాయింట్‌గా కూడా ఉంటుందట. ఇక ప్రస్తుత ఐప్యాడ్ మినీ 2021 సెప్టెంబర్‌ నెలలో లాంచ్ అయింది. ఇందులో 8.3-అంగుళాల డిస్‌ప్లే, A15 బయోనిక్ చిప్ సెట్, USB-C పోర్ట్, టచ్ ID పవర్ బటన్ ఇంకా అలాగే సెల్యులార్ మోడల్‌ల్లో 5g సపోర్ట్ వంటి సూపర్ ఫీచర్స్ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: