చంద్రుడి పై సల్పర్ తో పాటు ఆక్సిజన్ ఉందనే కోణంలో ప్రగ్యాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ తన పరిశోధనలు కొనసాగిస్తుంది. చంద్రుడి పై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉండనుంది. 14 రోజుల సమయంలోనే పరిశోధనలు చేసింది. ఇప్పుడు చీకటి సమయంలో దక్షిణ ధ్రువంలో దాదాపు మైనస్ 180 డిగ్రీల చల్లటి ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ సమయంలో ల్యాండర్, రోవర్ లు పని చేయవు. కాబట్టి వాటిని స్లీప్ మోడ్ లో పెట్టేశారు. మంగళయాన్ కు సంబంధించి ఇండియా పంపిన ఆర్బిటర్ అక్కడ తీసిన ఫోటోలు చూస్తే మార్స్ లో ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి.
మేఘాల మూవ్ మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి గ్రహంలో ఏదో ఒక విషయం తెలుస్తుంది. మార్స్ లో ఇలా ఉండటం వల్ల మనుషులు జీవించేందుకు అనుకూలమైన వాతావరణం ఉండే ఉంటుందని తెలుస్తోంది. కాబట్టి మంగళ్ యాన్ కూడా ఇస్రో పంపిన ప్రయోగం.. ఇది కూడా సరి కొత్త విషయాలు తెలుపుతుండటంతో చాలా మంది ఆసక్తి కనబరుస్తుననారు. రాబోయే రోజుల్లో ఇస్రో మరిన్ని ప్రయోగాలు చేసి భారత ఔన్నత్యాన్ని చాటేందుకు ప్రయత్నాలు చేస్తుంది. చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1, మార్స్ ఇలా రోజు రోజుకు ఇస్రో చేస్తున్న ప్రయోగాలతో రాటుదేలుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి