సాధారణంగా ప్రతి తండ్రి కూడా తమ పిల్లలను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేయాలని ఆశపడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇక కొడుకు ప్రయోజకుడు అయితే తండ్రి కంటే ఆనందపడేవారు ఇంకెవరూ ఉండరు అని చెప్పాలి. అయితే ఇక ఇలా పెంచి పెద్ద చేసిన పిల్లలకు పెళ్లి జరుగుతుంది అంటే ఆ తండ్రికి అది తన జీవితంలోనే ఒక పెద్ద పండగ లాంటిది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక తమ పిల్లల పెళ్ళి ఎంతో బాగా జరపాలని.. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులందరికీ కూడా ఎక్కడ ఏమీ తక్కువ కాకుండా చూసుకోవాలని ఈ భారీగా ఖర్చు పెట్టేందుకు కూడా సిద్ధపడుతూ ఉంటాడు తండ్రి.


 ఇటీవల కాలంలో ఎంతోమంది ఫాదర్స్ సరికొత్త ట్రెండ్ ఫాలో అవుతూ ఉన్నారు. ఒకప్పటిలా ఎంతో బాధ్యతగా పెళ్లి చేసి బాధపడటం కాదు.. ఇక ఏకంగా పెళ్లిని ఎంజాయ్ చేస్తూ..ఇక ఆ పెళ్లి జీవితాంతం గుర్తుండిపోయే ఒక మెమరీగా మార్చుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఒక తండ్రి కూడా ఇలాంటిదే చేశాడు. తన కొడుకు పెళ్లి జరుగుతూ ఉండడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే అతనిలో ఉన్న కుర్రాడు బయటికి వచ్చేసాడు. ఏకంగా కొడుకు పెళ్లిలో ఆ తండ్రి చేసిన సూపర్ డాన్స్ కి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొ
డుతుంది.


 ఢిల్లీలోని ఓ వేడుకలో ఇది జరిగింది అన్నది తెలుస్తుంది.  ఏకంగా కొడుకు పెళ్లి జరుగుతుంది అని ఆనందంలో అక్కడ వేదికపై డాన్స్ చేయడానికి ఏర్పాటు చేసిన ఒక ప్లేస్ లో ఏకంగా వరుడు తండ్రి ఒక సూపర్ హిట్ హిందీ పాటపై అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఏకంగా తనను తాను మైకేల్ జాక్సన్ లాగా భావించిన సదరు తండ్రి ఇక అదిరిపోయే స్టెప్పులతో రెచ్చిపోయాడు అని చెప్పాలి. అయితే ఇక వరుడు తండ్రి ఇలాంటి అద్భుతమైన డాన్స్ చేస్తూ ఉండడంతో అక్కడికి వచ్చిన బంధుమిత్రులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక దీనిని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: