చైనా నుండి ప్రపంచ దేశాలకు ఎగబాకిన కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడించింది. అలా తగ్గినట్టే తగ్గి ఇప్పుడు సెకండ్ వేవ్ తో తన విజృంభణను మొదలు పెట్టింది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది కానీ దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ కొందరు కరోనా బారిన పడ్డారని... మరికొందరు అనారోగ్య పాలయ్యారని పలు కథనాలు వింటూనే ఉన్నాం.