ఈ అనంత విశ్వంలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి.. కానీ అన్నీ బయటకు రావడం లేదు.. వాటిని చేదించాలని శాస్త్రవేత్తలు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.. అందుకే అంటారు ఈ విశ్వం ఒక ప్రశ్నల పుట్ట అని.. ఇకపోతే ఈ విశ్వం మరియు సృష్టి ఎలా పుటింది..? మానవ జాతి పుట్టుక ఈ భూమి పై ఎలా జరిగింది..? వీటికి సరిగ్గా సరిపోయే సమాధానాలను ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు.. ఏవేవో సిద్దాంతాలను అనుసరించి వివరిస్తారు కానీ అవి సరిగ్గా అర్ధం కావు..

 

 

ఇవన్నీ పక్కన పెడితే.. అర్థరాత్రి వేళ ఆరుబయట నిలబడి పైకి చూస్తే ఆ నిశీథి ఆకాశంలాగే.. మన మనసూ నిగూఢమైపోయి అంతరంగంలో ప్రశ్నల అలజడి మొదలవుతుంది. అసలు ఈ విశ్వంలో మనం ఏకాకులమా?.. మనలాంటి మేధో జీవులు ఎవరైనా ఉన్నారా అనే చిక్కు ప్రశ్నలు మదిలో ఉదయిస్తాయి... ఇలాంటి వాటికి సమాధానాలు వెతకడానికే శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాల నుండి తపన పడుతున్నారు.. ఈ క్రమంలోనే గ్రహాంతరవాసులు, ఫ్లైయింగ్ సాసర్స్‌.. గురించి తెలుసుకునేందుకు అంతరిక్ష శాస్త్రవేత్తలు  ఎప్పటి నుంచో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఖచ్చితమైన ఆధారాలను మాత్రం కనుక్కోలేకపోతున్నారు.

 

 

ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన పెంటాగాన్ సంస్థ తాజాగా ఫ్లైయింగ్ సాసర్స్‌కు చెందిన మూడు వీడియోలను విడుదల చేసింది. కాగా 2004, 2015లో శిక్షణా విమానాల పైలెట్ల ద్వారా ఈ మూడు వీడియోలు బయటకు వచ్చాయని పెంటాగాన్‌లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ వివరించింది.. ఇదిలా ఉంటే ఇందులో రెండు వీడియోలను 2017లో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించగా.. ఇంకో వీడియోను టు ది స్టార్స్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రూప్ విడుదల చేసింది.

 

 

అయితే ఈ వీడియోలో విమానానికి 40 అడుగుల దూరంలో.. భూ ఉపరితలానికి 50 అడుగుల ఎత్తులో గుర్తుపట్టలేకుండా ఉన్న వస్తువు ఒకటి తిరుగుతోంది. అది చాలా వేగంతో కదులుతూ వెళ్లింది. ఇదిలా ఉండగా పెంటాగాన్‌ ఈ వీడియోలను ఇప్పుడు విడుదల చేయడంతో.. మళ్లీ గ్రహాంతర వాసుల గురించి ఆసక్తి ప్రజల్లో పెరిగింది. అంతటితో ఊరుకోకుండా ఆ ఫ్లైయింగ్‌ సాసర్స్‌లో ఏలియన్స్ భూమి మీదకు వచ్చారేమోనంటూ మరి కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు... ఏది ఏమైన మంచి ఏలియన్స్ భూమిమీదకు వచ్చి కరోనాను తగ్గిస్తే బాగుండునని కొందరు ఆశపడుతున్నారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: