ఆన్లైన్లో వచ్చే చిట్కాలు అన్నిటినీ ఫాలో అవుతున్నారు ప్రజలు. ఓ పక్క డాక్టర్లు అన్ని చిట్కాలు అంత సురక్షితం కాదు అంటున్నా, వేరే మార్గం లేక దిక్కుతోచని స్థితిలో ఈ చిట్కాలు బెటర్ అంటూ చేసుకుపోతున్నారు. ఇటువంటి విపత్కర సమయంలో ప్రపంచ దేశాలకు గుడ్ న్యూస్ చెప్పారు శాన్ ఫ్రాన్సిస్కో శాస్త్రవేత్తలు. కరోనా ను ఎదుర్కొనే యాంటీబాడీలను ఉత్పత్తి చేయగల ఏరోనాబ్స్ కనుగొన్నారు. ఏరోనాబ్స్ తయారీలో భాగంగా రెండు బిలియన్ల సింథటిక్ నానో బాడీలపై ప్రయోగాలు చేశారు. ఇవే ఇప్పుడు కరోనాని అడ్డుకోవడానికి కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలుపుతున్నారు శాస్త్రవేత్తలు.
దీనిపై కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ ముఖర్జీ మాట్లాడుతూ ఇది ఏదో ఫాంటసీ కాదని మన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో వైద్యులు ఈ నానో బాడీస్ ను తయారు చేశారని, ఇవి కరోనాకు చెక్ పెట్టే విధంగా ఉన్నాయని, ముక్కు ద్వారా లేదా నోటి ద్వారా వీటిని స్ప్రే చేసే వీలు ఉంటుందని అయితే మనుషులపై ఎంతమాత్రం ఇవి సమర్థవంతంగా పని చేస్తాయో ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు చివరి దశ ప్రయోగాలలో నిమగ్నమై ఉన్నారని త్వరలోనే వీటి ఫలితాన్ని వెల్లడించనున్నట్లు చెప్పారు. ఇది కనుక సక్సెస్ అయితే వీటి భారీ ఉత్పత్తికి ఎక్కువ సమయం పట్టదని, చౌక ధరలో అందుబాటులోకి వస్తాయని సమాచారం. త్వరలోనే ఈ ప్రయోగం మంచి ఫలితాలు ఇచ్చి కరోనా నుండి ప్రపంచాన్ని విముక్తి చేయాలని కోరుకుంటున్నారు దేశ ప్రజలు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి