ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఈ భూమ్మీద విశ్వాసానికి మారు పేరంటే గుర్తొచ్చేది కుక్కలు. కుక్కలు ఎంత విశ్వాసంగా వుంటాయో చెప్పనవసరం లేదు. వాటి మీద గోరంత ప్రేమని చూపిస్తే చాలు అవి కొండంత విశ్వాసాన్ని కనబరుస్తాయి. ఇక ఒక్కోసారి కుక్కలు చేసే పనులు చాలా ముద్దొస్తాయి. అలాంటి క్యూట్ సందర్భం ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యి నెటిజెనులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఇక అసలు విషయానికి వస్తే...

మహారాష్ట్రాలోని ఓ గుడి బయట ఓ వీధి కుక్క.. భక్తులను ఆశీర్వదించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గుడి బయట ఉన్న ఓ పెద్ద అరుగు మీద భైరవుడు తరహాలో కూర్చొని ఉన్న ఆ కుక్కను చూడగానే భక్తులు కూడా వంగి నమస్కారం చేస్తున్నారు. దీంతో ఆ కుక్క తన ముందు కాలిని ఎత్తి భక్తుల తలపై పెట్టి ఆశీర్వదిస్తోంది.

ఇక ఈ దృశ్యం అయితే అక్కడి భక్తులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంతగానో ఆకట్టుకుంటూ వైరల్‌గా మారి సోషల్ మీడియాని బాగా షేక్ చేస్తుంది.ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ న్యూస్ ల గురించి తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: