రోజు రోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు ఎంత మొత్తుకున్నా..అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొంతమంది వాహన దారుల్లో మార్పు రావడం లేదు. బైక్ పై వెళ్లే వారు హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో..కారు నడిపే డ్రైవర్ సీట్ బెల్టు ధరించడం అంత ముఖ్యం. ఇక హెచ్చరికలు చేస్తే జనాల్లో మార్పు రాదని గ్రహించారో ఏమో కానీ ఓ స్వచ్చంధ సంస్థ వాళ్ళు సీట్ బెల్టు ధరించినవాళ్లకు అధిరిపోయే గిఫ్ట్ లు ఇచ్చే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చారు.  వివరాల్లోకి వెళితే..(ఐఎఫ్ఐటీ) ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ అనే సంస్థ సెల్ఫీ విత్ సీట్ బెల్ట్ అనే ఛాలెంజ్ ను తీసుకువచ్చింది. కార్ డ్రైవర్ సీట్ బెల్ట్ ధరించి సెల్ఫీ తీసుకుని.."సెల్ఫీ విత్ సీట్ బెల్ట్" అనే హాష్ టాగ్ తో పోస్ట్ చేయాలి. అలా చేస్తే ఐఎఫ్ఏటీ బహుమతి తో పాటు 5 లీటర్ల డీజిల్ ను కూడా అందిస్తుంది.

2016 నుండి ఐఎఫ్ఐటీ ప్రమాద సమయంలో సీట్ బెల్ట్ ధరించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చని అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్ లు సీట్ బెల్ట్ ను ధరించాలని ఈ సంస్థ ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం ఈ ఛాలెంజ్ హైదరాబాద్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో కూడా ట్రెండింగ్ లోకి వస్తోంది.ఈ విషయాన్ని ఐఎఫ్ఏటీ జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్ సలావుద్దీన్ తెలిపారు. అంతే కాకుండా చాలా మంది డ్రైవర్ లు సెల్ఫీ లు దిగి బహుమతులు గెలుచుకున్నారని చెప్పారు. ఐఎఫ్ఏటీ శ్రీకారం చుట్టిన సెల్ఫీ విత్ సీట్ బెల్ట్ అనే కార్యక్రమం అభినందించగలిగే కార్యక్రమం. కానీ ముందు ప్రజలు ఎవరో చెబితే నేర్చుకోవడం కాకుండా తమ కుటుంబాల కోసం..తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ట్రాఫిక్ నియమాలు పాటిస్తే మంచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: