ఇంట్లో తల్లిదండ్రులకు అప్పుడప్పుడు మందలిస్తూ వుంటారు. ఇక పిల్లలకు కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసు. వెంటనే అలుగుతారు. గదిలోకి వెళ్లి ఏడుస్తారు. లేదా స్నేహితుల ఇంటికి వెళ్లిపోతారు. తిరిగి కోపం తగ్గిన తర్వాతే మళ్ళీ ఇంటికి వస్తారు. అయితే, ఆ యువకుడు మాత్రం ఇవేవీ చేయలేదు. పలుగు, పార పట్టుకుని తన గార్డెన్‌లోనే గొయ్యి తవ్వడం మొదలుపెట్టాడు. అలా తవ్వుతూ తవ్వూతూ ఆరేళ్లు గడిపేశాడు. ఆ గొయ్యి ఇప్పుడు పెద్ద సొరంగమైంది. అంతేకాదు.. దాన్ని అతడు గెస్ట్ హౌస్‌గా మార్చుకున్నాడు.


ఇక వివరాల్లోకి వెళితే..స్పెయిన్‌ దేశంలోని లా రొమానాకు చెందిన ఆండ్రెస్ క్యాంటో 2015లో తనకు 14 ఏళ్ల వయస్సులో తన తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. క్యాంటోను తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు దుస్తులు మార్చుకోమని తెలిపారు. అయితే, క్యాంటో మాత్రం ట్రాక్ సూట్‌లోనే వస్తానని తెలిపాడు. ఇందుకు వారు ఒప్పుకోలేదు. దీంతో క్యాంటో ఇంట్లోనే ఉంటానని చెప్పడంతో వారు మాత్రమే గ్రామానికి వెళ్లారు. ఆ కోపం క్యాంటో తమ గార్డెన్‌లో గొయ్యి తవ్వడం మొదలు పెట్టాడు.

ఇక అలాగే తవ్వడం మొదలు పెట్టాడు.రోజూ స్కూల్ నుంచి రాగానే తవ్వేవాడు. ఏ రోజు విశ్రాంతి కూడా తీసుకోలేదు. చివరికి అతడు ఆ గొయ్యిని పెద్ద సొరంగంలా మార్చాడు. అతడికి స్నేహితుడు కూడా తోడయ్యాడు. గోతులను తవ్వేందుకు ఉపయోగించే యంత్రాన్ని తీసుకొచ్చాడు. దీంతో క్యాంటో పని మరింత సులభమైపోయింది. ఇప్పుడు క్యాంటోకు 20 ఏళ్లు. ఇప్పుడు ఆ సొరంగం భలే అందంగా ఉంది. అందులో ఒక సిట్టింగ్ రూమ్, బాత్రూమ్ కూడా ఉన్నాయి.

ఇక ఈ క్రమంలో క్యాంటో మాట్లాడుతూ.. ‘‘నా తల్లిదండ్రులు ఊరు వెళ్దాం దుస్తులు మార్చుకో అన్నారు. కానీ, నాకు ట్రాక్‌సూట్‌లో వెళ్లడమే ఇష్టమని చెప్పాను. అలాగైతే మాతో ఊరు రావద్దని చెప్పేశారు. పర్వాలేదు, నన్ను నేను ఎంటర్‌టైన్ చేసుకోగలను అంటూ ఇంటి వెనుక గార్డెన్‌లోకి వెళ్లి తవ్వడం మొదలుపెట్టాను. నా పనికి ఫ్రెండ్ అండ్రూ కూడా తోడయ్యాడు. ఓ రోజు 14 గంటల్లోనే 3 మీటర్ల గొయ్యి తవ్వేశాం. ఇప్పుడు నా సొరంగంలో వైఫై, హీటింగ్ సిస్టమ్ కూడా ఉంది. కానీ, ఆ గొయ్యిని అంతలా తవ్వడానికి కారణం ఏమిటో తలుచుకుంటే నవ్వొస్తోంది’’ అని తెలిపాడు. ఇప్పుడు క్యాంటో తవ్విన సొరంగం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.



https://youtu.be/3sSBKe8RCyg

మరింత సమాచారం తెలుసుకోండి: