మాములుగా ఎక్కడైనా ఆడవాళ్ళూ మగవాళ్లకు షాక్ ఇవ్వడం చూస్తుంటాం.. మాయమాటలు చెప్పి నిండా ముంచేస్తుంటారు. ఇప్పుడు మగాళ్లు ఆ మోసాలకు చెక్ పెడుతున్నారు. ఆడవాళ్లను నమ్మించడానికి వింత ప్రయోగాలు  చేస్తున్నారు. అది నిజమే అని నమ్మి కొందరు ఆడవాళ్లు ఫూల్స్ అవుతున్నారు. విషయానికొస్తే.. తాజాగా జరిగిన ఘటనలో ఓ యువకుడు మెట్రో లో సీటు కోసం కొత్త ప్రయోగం చేసాడు. అది నిజమే అని నమ్మిన ఆడవాళ్ళూ లేచి అతన్ని సీటులో కూర్చోబెట్టారు.


మాములుగా రైళ్లలో, బస్సులలో ఎక్కడ చూసిన కూడా సీట్లను ఆడవాళ్ళకు కేటాయించారు. ఇక మగవాళ్లకు సీటు దొరకడం చాలా కష్టం.. ప్రస్తుత రద్దీ పరిస్థితులలో సీటు దొరికి, కూర్చుని ప్రయాణించడమే చాలామంది హాయిగా ఫిలావుతుంటారు. ఇక ప్లేస్ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు ప్రయాణికులు. అన్ని చేసిన కూడా  సీటు దొరకపోతే, అక్కడే ఉన్న సపోర్ట్ వస్తువులను, అంటే రోపు, పైప్ పట్టుకోని నిల్చుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం కాస్తా విచిత్రంగా ప్రవర్తించి సీటును సంపాదించాడు.


ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ మెట్రోలో యువకుడు ఎక్కాడు. ఆ మెట్రో ఫుల్ రద్దీగా ఉంది. ఇక తప్పక అక్కడే ఉన్న రోప్ పట్టుకొని నిల్చున్నాడు. ఇంతలో ఆకస్మాత్తుగా ఆ యువకుడు మూర్ఛా వచ్చినట్లుగా వణికిపోయాడు. దీంతో అక్కడి ప్రయాణికులు ఒక్కసారికి భయాందోళనకు గురయ్యారు. వెంటనే అతడికి ఎదురుగా ఉన్న మహిళ లేచి పక్కకు పరిగెత్తింది. మరో మరో మహిళ అతని టోపి కింద పడిపోతే అది తీసి సీటు పైన పెట్టింది. ఇక ఆ తర్వాత యువకుడు ఆ సీట్లో కూర్చొని మరోసారి షాక్ కొట్టినట్లుగా వణికిపోయాడు. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ యువకుడు  వీడియో తీసాడు. అది సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఇక నెటిజన్లు మాత్రం అతని తెలివికి ఫిదా అయ్యి వివిధ రకాల కామెంట్లను పెడుతున్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: