ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ప్రభావం బాగా తగ్గిపోయింది. కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక తాజాగా గత 24 గంటల్లో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 1,00,001 సాంపిల్స్‌ని పరీక్షించగా అందులో 5,646 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక కరోనా వల్ల చిత్తూరు జిల్లాలో పదకొండు మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడుగురు, గుంటూరు జిల్లాలో ఆరుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు, శ్రీకాకుళం జిల్లాలో నలుగురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, కడప జిల్లా జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, కర్నూల్‌ జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోవడం జరిగింది.ఇక గత 24 గంటల్లో చూసుకున్నాట్లైతే..7,772 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

ఇక ఈ రోజు వరకు రాష్ట్రంలో 2,11,50,847కరోనా  సాంపిల్స్ పరీక్షించగా.. అందులో 18,50,563 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక వీరిలో 17,75,176 మంది కరోనా కోలుకున్నారు.ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 63,068 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.ఇక కరోనా వైరస్ తీవ్రతతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12,319 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.ఇక జిల్లాల వారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.ఇక అనంతపురం జిల్లాలో 386 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో – 890, ఈస్ట్ గోదావరి జిల్లాలో – 1,098, గుంటూరు జిల్లాలో – 309, కడప జిల్లాలో – 307, కృష్ణా జిల్లాలో – 441, కర్నూలు జిల్లాలో – 127, నెల్లూరు జిల్లాలో – 213, ప్రకాశం జిల్లాలో – 387, శ్రీకాకుళం జిల్లాలో – 396, విశాఖపట్నం జిల్లాలో – 176, విజయనగరం జిల్లాలో – 155, పశ్చిమ గోదావరి జిల్లాలో – 761 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: