ఇక వర్షాలు బాగా కురుస్తున్న సంగతి తెలిసిందే.అలాగే నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి వర్షాలు ఢిల్లీ నగరాన్ని ముంచెత్తుతున్నాయి. ఇక దీంతో సామాన్య ప్రజలు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.అలాగే రోడ్లపైకి బాగా నీరు చేరడంతో చాలా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఇక చిన్న చిన్న వాహనాలు ఉన్న వారి పరిస్థితి అయితే చాలా దారుణంగా మారింది. అయితే తాజాగా ఢిల్లీ నగరంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న ఒక బస్సులో వర్షపు నీరు వరదల ప్రవహిస్తుంది.దాంతో బస్సులో ఉన్న ప్రయాణీకులు నానా ఇబ్బందులు పడ్డారు.ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతుంది.

ఇక నిన్న మొన్నటి దాకా దక్షణ భారతదేశాన్ని అతలాకుతలం చేసిన వానలు… ఉత్తర భారత దేశాన్ని కూడా ఇంకా వీడడం లేదు. ఎడతెరపి లేకుండా వానలు బాగా కురుస్తూ… దాదాపు ఉత్తర భారత దేశాన్ని స్థంబించేలా చేస్తున్నాయి.ఇక తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలకు అక్కడి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులు నుంచి ఢిల్లీలో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయంగా మారాయి. అలాగే లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. అయితే అక్కడి వరద పరిస్థితి అందరికి తెలిసేలా ..ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. పూర్తి ప్రయాణికులతో నిండి ఉన్న ఢిల్లీ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ బస్సులో లోపలికి రెండు అడుగుల లోతు దాకా నీరు వచ్చి చేరింది. దాంతో బస్సులో ఉన్న ప్రయాణికులు సీట్లను ఎక్కడం… ఇంకా రాడ్లను పట్టుకుని వేలాడడం వంటి పనులు చేయాల్సి వచ్చింది. ఇక ఇటీవల చైనాలో కూడా సంభవించిన వరదల దాటికి ఓ మెట్రో రైల్లో నడుము లోతు వరకు నీళ్లు చేరిన సంగతి తెలిసిందే..ఇక అన్నిటికంటే చాలా ప్రమాదకరమైన కాలం వర్షా కాలం అనే చెప్పాలి.ఈ కాలం లో అనేక రకాల సమస్యలనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.వర్షాకాలం స్టార్ట్ అయ్యింది.


https://twitter.com/ANI/status/1419870925227319303?s=19

మరింత సమాచారం తెలుసుకోండి: