అమాయకమైన పిల్లలు చాలా ముద్దొస్తారు కదూ. కల్లా కపటం లేకుండా మనసులో ఎలాంటి కల్మషం లేకుండా చిరునవ్వులు చిందించే పిల్లలను చూస్తే కష్టాలన్నీ వెంటనే మరిచిపోవచ్చు. ఇక ఈ బుల్లి కోతి ఇంకా బాతు పిల్లల స్నేహాన్ని చూసినప్పుడు కూడా మీకు అదే భావన కలుగుతుంది. ఎలాంటి జాతి వైరం అనేదే లేకుండా ఒకదానిపై ఒకటి చూపిస్తున్న ప్రేమను చూస్తే మీరు తప్పకుండా ఫిదా అయిపోతారు.ఇక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నందా పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ నెటిజనుల మనసు దోచుకుంటోంది.ఇక ఈ వీడియోలో ఓ కోతి పిల్ల పసుపు రంగు బాతు పిల్లలతో మంచిగా స్నేహం చేస్తోంది. అలాగే ఆ బాతు పిల్లలు కూడా ఆ కోతిని అస్సలు విడిచిపెట్టడం లేదు. అవి కూడా ఆ కోతితో చాలా స్నేహంగా ఆడుకుంటున్నాయి. ఇక ఎంచక్కా ఆ కోతి పక్కనే అవి నిద్రిస్తున్నాయి. ఇక ఆ కోతి కూడా వాటిని ఏమీ అనకుండా సొంత బిడ్డల్లా కంటికి రెప్పలా పాలిస్తోంది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు ఫుల్ ఫిదా అయ్యి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమ జాతి వైరం మరిచి అవి అంత స్నేహంగా ఉండటం నిజంగా చాలా గ్రేట్ అని అంటున్నారు. మనుషులు కూడా ఇలా ఐక్యంగా కలిసి మెలిసి జీవిస్తే యుద్ధాలే ఉండవని నెటిజన్స్ అంటున్నారు.ఇక ఈ వీడియోలో ఉన్న క్యూట్ కోతి పిల్ల పేరు ‘బీబీ’ (BiBi). ‘యానిమల్ హోమ్’ (Animal Home) అనే యూట్యూబ్ చానెల్ ద్వారా ఈ కోతి పిల్ల నెటిజనులకు సుపరిచితం. ఇక ఆ బాతు పిల్లల తల్లి ఈ కోతికి మంచి ఫ్రెండ్.ఇక ఆ బాతు బయటకు వెళ్లినప్పుడు బీబీ కోతి వాటి బాధ్యతలు చక్కగా చూసుకుంటుంది. కేవలం ఆ బాతు మాత్రమే కాదు, ఈ కోతి పిల్ల ఓ కుక్క పిల్లతో కూడా స్నేహం చేస్తోంది. బాతు, కుక్క ఇంకా కోతి.. ఈ మూడు తమ జాతి వైరాన్ని మరిచిపోయి ఎంతో స్నేహంగా కలిసి మెలిసి జీవిస్తున్నాయి. రోజూ చక్కగా ఆటలాడుతూ టైంపాస్ చేస్తుంటాయి. ఇక ఈ కింది వీడియోలు చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోవడం ఖాయం.


https://twitter.com/susantananda3/status/1417476533531385861?s=19

మరింత సమాచారం తెలుసుకోండి: