హోలీ.. రంగోలి.. చిన్నల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన పండుగ ఇది. ఇక చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకునే పండుగ ఇది. సామాన్యులు సంపన్నులు అనే తేడా లేకుండా ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ ఇది. అందుకే హోలీ పండుగ వచ్చింది అంటే చాలు ఇక ప్రతి ఒక్కరు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి సిద్ధమవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక దేశంలో హోలీ పండుగను అందరూ ఎంతో ఘనం గా జరుపుకుంటారు. సంబరాలు చేసుకుంటూ రంగులు చల్లుకుంటూ ఉంటారూ. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగాహోలీ పండుగను జరుపుకుంటారు అనే విషయం తెలిసిందే.



 అయితే ఇటీవలి కాలంలో మాత్రం హోలీ పండగ అర్థాన్నే మార్చేస్తున్నారు ఎంతోమంది. ఒకప్పుడు కేవలం రంగులు మాత్రమే ఒకరిపై ఒకరు చల్లుకునేవారు. అది కూడా ఎలాంటి రసాయనాలు కలవని రంగులను మాత్రమే హోలీ పండుగ రోజు ఉపయోగించే వారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం రంగులతోపాటు ఏకంగా కోడిగుడ్లు ఒకరిపై ఒకరు కొట్టుకోవడం అంతటితో ఆగకుండా ఏకంగా పిండి కూడా ఒకరిపై ఒకరు చల్లుకోవడం లాంటివి చేస్తూ చిత్ర విచిత్రంగా హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్న  విషయం తెలిసిందే. కాగా హోలీ సెలబ్రేషన్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి.



 ఇక ఇప్పుడు ఇలాంటి హోలీ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఒక వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లుకొడుతుంది. ఏకంగా హోలీ పండుగ రోజున ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడమే కాదు ఏకంగా ఒకరిని ఒకరు చెప్పులతో కొట్టుకున్నారు. బీహార్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బీహార్ రాజధాని పాట్నాలో నియో వాటర్ పార్క్ లో రంగులు పూసుకున్న యువత ఇక ఆ తర్వాత చెప్పులతో దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులు   విసురుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: