కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు.. మహాపురుషులవుతారు అని ఆ కవి  ఊరికనే రాయలేదు. టాలెంట్ ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపించింది ఈ బాలిక. ఆమె టాలెంట్ గుర్తించి  కేరళ రాష్ట్ర సర్కార్ బిరుదుతో సత్కరించింది. మరి అంతటి ఘనత సాధించిన ఆ బాలిక ఎవరు ప్రపంచ కవయిత్రుల దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం..!  ఆ బాలికకు 14 సంవత్సరాల వయసు కేరళ రాష్ట్రంలో జన్మించింది. 14 సంవత్సరాల నుండి 13 పుస్తకాలను రచించి శభాష్ అనిపించుకుంది. మరి ఆ బాలిక పేరు  ఏంటో తెలుసుకుందామా..!

ఆ బాలిక పూర్తి పేరు సనీషా ఆమె ఆరో తరగతి లో ఉన్నప్పుడే మొదటిగా ఆంగ్ల పుస్తకాన్ని రాసింది. తర్వాత ఆమె రాసిన నవలలు చిన్న చిన్న కథలు, కవితలు రాస్తూ తన కవితా ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చింది. అలాగే ఈ అమ్మాయి రెండు వందలు వరల్డ్ క్లాసికల్ సినిమాల పై కూడా రివ్యూలు రాసింది. ఈ బాలిక పుస్తకాలు రాయడమే కాకుండా తన యొక్క పుస్తకాల కవర్ పేజీ లను కూడా ఆమె డిజైన్ చేసుకుంటుంది. ఆమె రచనలకు గాను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఉజ్వల బాల్యం అనే అవార్డును అలాగే కక్కడ్ అనేక అవార్డులు కూడా గెలుచుకున్నది. ఆమె రచనల పట్ల మక్కువ కాకుండా సంగీతం, కలలను కూడా ప్రేమిస్తుంది.

 ఏదో ఒక రోజు చిత్ర దర్శకురాలుగా మారాలి అన్నది తన ధ్యేయమని చెబుతోంది. ఏది ఏమైనా ప్రస్తుత రోజుల్లో కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్ల పుడితే నే భారంగా భావించి పురిట్లోనే చంపేస్తూ ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఆడ పిల్లలను కూడా అంతరిక్షానికి పంపిస్తూ  ఔరా అనిపిస్తున్నారు. ఏది ఏమైనా సమాజంలో లింగ భేదం అనేది లేకుండా తయారవడమే మంచి పరిణామం అని చెప్పవచ్చు. ఆడపిల్ల అంటే  ఏదైనా సాధిస్తుంది అని స్ఫూర్తి నింపడానికి ఇలాంటి వారు సమాజానికి చాలా అవసరమని మనం గమనించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: