సాధారణంగా ప్రేమికులు అంటే సరదాగా అప్పుడప్పుడు బయటికి వెళ్లడం చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఇలా బయటికి వెళ్లిన సమయంలో ఏవో ఊసులు చెప్పుకుంటూ హాయిగా సమయాన్ని గడిపేస్తూ ఉంటారు. గిల్లికజ్జాలు ఆడుకుంటూ ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమను కురిపించు కుంటూ ఉంటారు. సాధారణంగా ఇటీవల కాలంలో ఇలాంటి దృశ్యాలు పార్కులు లేదా ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో కూడా చూస్తూనే ఉంటాము. ఎంతో మంది ప్రేమికులు సరదాగా పార్కులకు వచ్చి కబుర్లు చెప్పుకుంటూ సమయాన్ని గడపడం  చేయడం చూసాము. కానీ ఇక్కడ ఇద్దరు ప్రేమికులు మాత్రం చేయకూడని పని చేశారు.


 చేయకూడని పని అనేసరికి బూతు అనుకోకండి ఎందుకంటే ఇక్కడ ప్రేమికులు చేసింది ఒక వింత అయిన పని. ఇప్పుడు వరకు సరదాగా కబుర్లు చెప్పుకోవడం చూశాము. కానీ ఇక్కడ ఒక ప్రేమికుడు మాత్రం పార్క్ కు వెళ్ళిన సమయంలో ప్రేయసికి తలలో పేలు చూశాడు. ఇది  వినడానికి కాస్త విచిత్రంగా ఉంది కదూ. కానీ ఇది అక్షరాల నిజం. ప్రేమికులు ఇద్దరూ పార్కులో ఏకాంతంగా కూర్చుని సమయంలో ప్రేయసితో సరదాగా కబుర్లు చెప్పాల్సిన ప్రియుడు చివరికి ఆమె తలలో ఉన్న పేలు చూస్తూ ఉన్నాడు.


 ఇందుకు సంబంధించిన వార్త కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే సదరు యువకుడు ఇలా చేయడాన్ని చూసినా అదే పార్క్ లో ఉన్న కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో తెగ చక్కెర్లు కొడుతుంది. ఇది చూసిన ఎంతో మంది నెటిజన్లు అతనికి బాయ్ ఫ్రెండ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇచ్చేస్తున్నారు. ఈ వీడియోలో చూసుకుంటే అబ్బాయి ఒడిలో అమ్మాయి కూర్చుంది. ఇలాంటి సమయంలో కబుర్లు చెప్పాల్సిన ప్రియుడు నెత్తిలో పేలు చూస్తున్నాడు. కాగా ఈ వీడియో పై ఒక రేంజ్ లో ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: