ముఖ్యంగా ఈ భూమండలంలో మనిషి మనుగడకు ఇండైరెక్ట్గా కారణమైన పక్షులు జంతువులను సైతం ఈ భూమ్మీద బ్రతకనివ్వకుండా దారుణంగా ప్రాణాలు తీసేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మనుషులకు తప్ప ఈ భూమ్మీద బ్రతికేందుకు ఇంకే జీవికి కూడా అర్హత లేదు అనే విధంగానే మనుషుల ప్రవర్తన నేటి రోజుల్లో కనిపిస్తుంది అని చెప్పాలి. కొంతమంది వ్యక్తులు మూగజీవాల విషయంలో వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా ఆగ్రహానికి గురిచేస్తుంది అనే చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. పక్షులను నిర్ధాక్షణ్యంగా చంపేసిన వీడియో కాస్త ట్విట్టర్లో వైరల్ గా మారింది.
ప్రశాంతంగా చెట్టుపై సేదతీరుతున్న అనేక పక్షులను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఇక వందల పక్షులు ఉన్న చెట్లు నేలమట్టం చేయడంతో ఇక ఆ చెట్టు కింద పడి ఎన్నో పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. ఇలా అప్పటి వరకూ ఎంతో స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ కనిపించిన పక్షులు రెప్పపాటుకాలంలో చెట్టు కింద పడి చివరికి ప్రాణాలు కోల్పోయాయి. ఇక ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ అధికారి ప్రవీణ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. మనిషి తన సొంత అవసరాలు తీర్చుకోవడం కోసం రోజురోజుకు క్రూరంగా మారిపోతున్నాడు అని ఈ వీడియో చూసిన తర్వాత ఎంతోమంది కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి