అడవుల్లో ఉండే అతి భయంకరమైన క్రూర మృగాలలో   పులి కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే సింహం అడవికి రారాజు అయితే సింహం తర్వాత అతి బలవంతమైన క్రూరమృగం పులి అని చెప్పాలి. ఈ క్రమంలోనే పులి వేటాడటం మొదలుపెడితే ఎలాంటి జంతువు అయినా సరే దానికి ఆహారంగా మారిపోవాల్సిందే. అయితే సాధారణంగా మిగతా జంతువులు పులి కనిపించింది అంటే చాలు ప్రాణాలు  దక్కించుకోవడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే పులి ఇతర జంతువులను భయపెట్టడమే కానీ అది భయపడటం మాత్రం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం.


 కానీ ఇక్కడ మాత్రం పులి భయపడిపోయింది. ఇంతకీ పులి భయపడింది ఎవరికో తెలుసా పులి భార్యకి. సాధారణంగా ఏ భార్యకైనా సరే భర్తలు భయపడాల్సిందే అన్నది ఇటీవల కాలంలో ప్రతి మగాడు చెప్పే మాట. పైకి ఎంతో గంభీరంగా కనిపించినప్పటికీ లోలోపల మాత్రం మగాడు భార్యకు భయపడుతూనే ఉంటాడు అని అంటూ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ ఎన్నో రకాల మీమ్స్ వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో చూసి కేవలం మనుషులు మాత్రమే కాదు పులి సైతం భార్యకు భయపడాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఎందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ వేదికగా తెగ చక్కెరలు కొడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ వీడియోలో చూసుకుంటే జూలోని ఒక కొలను దగ్గర ఆడ పులి ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు కనిపిస్తుంది. అయితే అప్పుడే అక్కడికి ఒక మగ పులి వచ్చింది. దీంతో ఆడ పులి దగ్గరికి వెళ్లి రొమాంటిక్ గా టచ్ చేయడానికి ప్రయత్నించింది. దీంతో ఒక్కసారిగా ఆడ పులి లేచి మగ పులిపై గర్జిస్తుంది. కోపంతో దాడి చేసేందుకు పైపైకి వస్తుంది. ఇంకేముంది మగ పులి భయపడి తోకముడిచి వెనక్కి పరిగెడుతుంది. ఇది చూసిన నెటిజన్లు  మనుషులే కాదు పులి సైతం భార్యకు భయపడాల్సిందే అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: