ఓ వ్యక్తి తలను 181 ఏళ్ళుగా భద్రంగా దాచారు.. అసలు అతను సెలెబ్రేటినా..రాజునా అనే సందేహం వస్తుంది కదూ..అతను ఒక క్రిమినల్.. అలా సరిపోదు..పేరు మోసిన క్రిమినల్ అతని చేతిలో ఏకంగా 70 ప్రాణాలను కొల్పొయారు..విషయానికొస్తే..పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో ఓ వ్యక్తి తలను 181 ఏళ్లకు పైగా జాడీలో భద్రంగా దాచారు..స్పెయిన్‌లోని గెసెలియా నగరంలో 1819లో డియాగో జన్మించాడు. యుక్త వయసుకు వచ్చాక పని వెతుక్కుంటూ పోర్చుగల్‌లోని లిస్బన్‌కు చేరుకున్నాడు. ఇక్కడ ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే అతనికి ఉద్యోగం దొరకలేదు. దీంతో చిన్న చిన్న నేరాలు చేసే ముఠాతో కలిసి రద్దీ ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడేవాడు. ఆ డబ్బుతో జల్సాగా గడిపేవాడు. తను మరింత ఎక్కువ డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుని రైతులను టార్గెట్‌గా చేసుకున్నాడు. మార్కెట్‌లో తమ పంటను అమ్ముకుని డబ్బుతో ఇంటికి వెళ్లే రైతుల కోసం బ్రిడ్జిపై కాపు కాసేవాడు. ఎవరైనా ఒంటరిగా వెళ్తున్నట్టు కనిపిస్తే అతడిని దోచుకుని చంపేసి, బ్రిడ్జిపై నుంచి కిందకు తోసేవాడు. అలా ఎంతో మందిని డియాగో పొట్టన పెట్టుకున్నాడు.


బ్రిడ్జి దగ్గర చనిపోయిన వారందరూ ఆత్మహత్యలు చేసుకుని ఉంటారని పోలీసులు భావించేవారు. ఎందుకంటే అప్పట్లో సైన్సు ఇంతగా అభివృద్ధి చెందలేదు. పోస్ట్‌మార్టమ్ చేసి మృతికి అసలైన కారణం కనుక్కోవడం అప్పట్లో వీలయ్యేది కాదు. పంట నష్టం రావడంతో రైతులు ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పోలీసులు, అధికారులు అనుకునేవారు. మృతుల సంఖ్య 50కి పెరగడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. మృతుల కుటుంబ సభ్యులను విచారించగా వారిలో చాలా మంది డబ్బుకు ఇబ్బంది లేని ధనిక రైతులేనని తేలింది. దీంతో పోలీసులు బ్రిడ్జిపై భద్రతను పెంచారు. దాంతో డియాగో మరో పథకం వేశాడు. చిన్న చిన్న నేరాలు చేసే కొందరితో కలిసి ఓ ముఠాగా ఏర్పడి లిస్బన్ నగరంలోని ధనికుల ఇళ్లను టార్గెట్ చేసుకుని దోపీడీలకి పాల్పడేవాడు. అలా దోచుకున్న ఇంట్లోని వారిని చంపేసేవాడు.


అలా ఓ వైద్యుడు ఇంట్లో చోరీ చేసి పారి పొతుండగా తన ముఠాతో కలిసి పోలీసులకు దొరికిపోయాడు. అతడిని కఠినంగా విచారించిన పోలీసులు మొత్తం విషయాలు రాబట్టారు. విచారణలో డియాగో మొత్తం నేరాలను అంగీకరించాడు. తన చేతిలో 70 మంది కంటే ఎక్కువగానే ప్రాణాలు కోల్పోయారని చెప్పాడు. పోర్చుగల్ కోర్టు 1841లో డియాగోకు మరణ శిక్ష విధించింది. లిస్బన్‌లోని కొంతమంది వైద్యులు తమ పరిశోధన కోసం డియాగో మెదడు కావాలని కోర్టును, ప్రభుత్వాన్ని కోరారు. అలాంటి సీరియల్ కిల్లర్స్ ఎలా ఆలోచిస్తారనే దానిపై పరిశోధన చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. డియాగో మెదడును వైద్యులకు ఇచ్చేందుకు కోర్టు, ప్రభుత్వం అనుమతించాయి.దాంతో అప్పటి నుంచి ఇప్పటివరకు అతని తలను దాచారు..ఇది అసలు మ్యాటర్..


మరింత సమాచారం తెలుసుకోండి: