ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక ఎన్నో రకాల వీడియోలు అటు ఇంటర్నెట్లో ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇందులో కొన్ని వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక కొన్ని వీడియోలు అయితే అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ఏకంగా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.


 ఇంతకీ సోషల్ మీడియాను ఊపేస్తున్న ఈ వీడియోలో ఉంది ఎవరో తెలుసా? ఏకంగా వయస్సు మళ్ళిన తాత. అదేంటి వయస్సు మళ్ళిన వృద్ధుడికి సంబంధించిన వీడియోలో పెద్దగా ఏముంటుంది అని అనుకుంటున్నారా.. అలా అనుకున్నారంటే మీరు పొరబడినట్లే. ఇటీవల కాలంలో  ఎంతో మంది యువకులు రోడ్లపై బైకులతో విన్యాసాలు చేసి ఇక ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడం లాంటివి చూసే ఉంటారు. ఇక ఇలాంటి విన్యాసాలు చూసినప్పుడు వావ్ అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడో తాత కూడా ఇలాంటి విన్యాసాలు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.


 సాధారణంగా 70 ఏళ్ల వయసు వచ్చిన సమయంలో ఎవరైనా సరే ఇంట్లో మనవళ్లు మనవరాళ్లతో ఆడుకుంటూ కృష్ణ రామ అనుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక తాత మాత్రం ఎంతో హుషారుగా సైకిల్ పై విన్యాసాలు చేశాడు. ఏకంగా రోడ్డుపై వేగంగా సైకిల్ ని నడుపుతూ ఎన్నో విన్యాసాలు చేయగా.. అటువైపుగా వెళ్తున్న మరో వ్యక్తి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. వయసుతో సంబంధం లేకుండా ప్రతిక్షణం హాయిగా గడపాలని ఈ తాతను చూస్తే అర్థమవుతుందంటూ ఎంతోమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక 70 ఏళ్ల వయసులో కూడా అలాంటి విన్యాసాలు చేయడం అంటే నిజంగా గ్రేట్ అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: