టీమిండియా లో దిగ్గజా ఆటగాడుగా.. మాజీ కెప్టెన్ గా పేరుపొందిన మహేంద్ర సింగ్ ధోని అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్.. కూల్ కెప్టెన్ గా కూడా పేరు పొందారు మహేంద్రసింగ్ ధోని.. ఈసారి ఐపీఎల్ సీజన్లో కప్పు కొట్టిన తర్వాత తన మోకాలలు నొప్పి అవ్వడంతో హాస్పిటల్ కి వెళ్ళగా వారు శాస్త్ర చికిత్స చేయించినట్టుగా తెలుస్తోంది.. ముంబైలోని కోకిల బెన్ ఆస్పత్రిలో నిన్నటి రోజున ఉదయం నిర్వహించిన సర్జరీ విజయవంతంగా పూర్తయినట్లుగా తెలుస్తోంది.. ఈ విషయాన్ని CSK సీఈవో కాశీ విశ్వనాథ్ ఒక ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ తెలియజేసినట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల నుంచి మహేంద్ర సింగ్ ధోని ఆసుపత్రిలోనే ఉన్నాడంటూ ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.


చేస్తా చికిత్స అనంతరం ధోనితో మాట్లాడిన..CSK  సీఈవో కాశీ విశ్వనాథ్ ఆపరేషన్ తర్వాత నేను అతనితో మాట్లాడాను శస్త్ర చికిత్స గురించి నేను వివరించలేను కానీ అది కీ హోల్ సర్జరీ అని మాత్రం చెప్పగలను అతను బాగానే ఉన్నాడంటూ తెలియజేశారు విశ్వనాథ్.. అయితే గతంలో ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ కు ఆపరేషన్ చేసిన స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ దిన్ష్ పార్దివాలనే ధోనికి కూడా ఆపరేషన్ చేసినట్టుగా తెలుస్తోంది ధోని భార్య సాక్షితో కలిసి ధోని హాస్పిటల్ కి వెళ్లారు.


 ఈ శస్త్ర చికిత్స తర్వాత ధోని పూర్తిగా కోలుకునేందుకు ఎన్ని రోజులు సమయం పడుతుందని విషయం మాత్రం ఇంకా తెలుపలేదు.. అయితే అతను రానున్న రెండు నెలల పూర్తిగా ఫిట్నెస్ గా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ సార్ విజేతగా నిలిచింది. ఐపీఎల్ లో అత్యధిక టైటిల్స్ ను అందుకున్న రోహిత్ శర్మ రికార్డును సైతం ధోని సమానం చేశారు. అయితే వచ్చే ఐపీఎల్ కు ధోని ఆడతారా లేకపోతే రిటైర్మెంట్ ను ప్రకటిస్తారా అనే విషయం ఇంకా తెలియలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: