అడవుల్లో ఉండే అన్ని జీవుల మధ్య ఎప్పుడూ బ్రతుకు పోరాటం జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు కడుపు నింపుకోవడానికి పోరాటం చేయాల్సి వస్తే.. ఇంకొన్నిసార్లు ఆధిపత్యం కోసం పోరాటం చేయాల్సి ఉంటుంది. దీంతో ఇక ఎన్నో జీవులు ఇలా ప్రతిక్షణం బ్రతుకు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాయి. అయితే ఈ భూమి మీద ఉండే జీవులలో జాతి వైరాన్ని కలిగిన జీవులు కొన్ని మాత్రమే ఉన్నాయి. అలాంటి వాటిలో పిల్లి, కుక్క ఎలా అయితే జాతి వైరాన్ని కలిగి ఉంటాయో.. అటు ముంగిస - పాము కూడా ఇలాగే జాతి వైరాన్ని కలిగి ఉంటాయి.


 కొన్ని ఫ్యాక్షన్ సినిమాలలో చూపిస్తూ ఉంటారు కదా.. తాతలు ముత్తాతల కాలం నుంచి కొనసాగుతున్న పగ అని.. ఇక ముంగిస - నాగుపాము ఎదురుపడినప్పుడు ఇలాగే తాతలు ముత్తాతల నుంచి జాతి వైరం ఉందేమో అన్నట్లుగానే ఈ రెండు పోట్లాడుకుంటూ ఉంటాయి అని చెప్పాలి.  ఇక కొన్ని కొన్ని సార్లు ముంగిస పైచేయి సాధిస్తే ఇంకొన్నిసార్లు నాగుపాము బీకర పోరులో విజయం సాధిస్తూ ఉంటుంది. ఇక ఇలా పాము ముంగిస పోట్లాటకు సంబంధించిన వీడియోలు చాలానే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతూ వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా గోధుమ రంగులో ఉన్న ఒక నాగుపాము.. ముంగిస మధ్య బీకరమైన పోరు జరిగింది. అయితే ఈ వీడియో కాస్త స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే స్లో మోషన్ లో పాము ఎలా ముంగిసపై దాడి చేస్తుంది  ఇక ముంగిస తప్పించుకుంటూ పాముపై ఎలా దాడికి దిగుతుంది అని స్పష్టంగా అర్థమయ్యేలా ఈ వీడియోలో కనిపిస్తుంది ఆకర్షిస్తుంది అని చెప్పాలి. ముంగిస ఎంతో చాకచక్యంగా పాము దాడి నుంచి తప్పించుకుంటూ నాగుపాము పై దాడి చేసేందుకు ప్రయత్నించగా.. నాగుపాము కూడా ఇక ఎక్కడ అలసిపోకుండా ముంగిస పై దాడి చేయడం ఈ వీడియోలో చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: