అడవుల్లో జీవించే జంతువుల మధ్య మనుగడ కోసం ప్రతి రోజు పోరాటం సాగుతూనే ఉంటుంది. ఏకంగా ప్రాణాలను రక్షించుకోవడానికి కొన్ని జంతువులు పోరాడితే.. ఆకలిని తీర్చుకొని మనుగడ సాగించడానికి మరికొన్ని జంతువులను పోరాడుతూ ఉంటాయి. ఇక ఇలా ఆకలిని తీర్చుకోవడం కోసం ఇతర జంతువులను వేటాడటం లాంటివి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.


 ఇలా అన్ని జంతువులు అనుక్షణం పోరాటం సాగిస్తూనే ఉంటాయి. ఈ క్రమం లోనే అడవుల్లో ఉండే పులులు సింహాలు లాంటివి ఎంత దారుణంగా వేటాడుతాయి అన్నదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ప్రత్యక్షమవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్నిసార్లు విచిత్రమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఏకంగా ఒక క్రూరమృగం ఏదైనా జంతువును వేటాడి తింటూ ఉంటే.. వేరే జంతువు వచ్చి ఏకంగా నోటి దాకా వచ్చిన ఆహారాన్ని లాక్కుని వెళ్లడం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారి పోయింది.


 చిరుత పులి ఎంతో కష్టపడి ఒక జింకను వేటాడింది. హమ్మయ్య ఈ రోజుకి కడుపు నిండి పోయింది అంటూ హాయిగా ఆరగించేందుకు రెడీ అయింది. అంతలో అక్కడికి ఎంట్రీ ఇచ్చిన హైనా చిరుతపులిని బెదరగొట్టి హైనాను హాయిగా ఆరగించాలని సిద్ధమైంది. అంతలో రెండు మొసళ్ళు అక్కడికి ఎంట్రీ ఇచ్చాయి. ఈ క్రమంలోనే ఆ మొసళ్ళకి జింక దక్కకుండా ఉండేందుకు హైనా బలవంతంగా జింకను దూరం లాక్కేళ్లేందుకు  ప్రయత్నిస్తుంది. కానీ చివరికి మొసళ్ల నోటికి ఆ జింక చిక్కేస్తుంది. ఇక హైనాలు ఆ జింకను లాక్కునేందుకు చాలా ప్రయత్నించి చివరికి వెళ్ళిపోతాయ్. దీంతో రెండు మొసళ్ళు జింకను హాయిగా ఆరగించి సరస్సులోకి చేరుకుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. కలలో కూడా ఊహించని ఈ పోరుని చూసి అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: