ఢిల్లీలో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భారత రాజధాని గ్రేటర్ కైలాష్ (2వ భాగం) ప్రాంతంలో ఒక కారులో ప్రియురాలి పై ప్రియుడు దారుణంగా దాడి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారు జాము మధ్యలో జరిగినట్లు సమాచారం.

అజయ్ జో అనే వ్యక్తి ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో, ఒక లవర్ వెళ్తున్న కారులో తన ప్రియురాలితో గొడవ పడుతున్న దృశ్యాలు కనిపించాయి. సదరు బాయ్‌ఫ్రెండ్ ఆ మహిళపై బిగ్గరగా కేకలు వేస్తుండగా, ఆ మహిళ ఆందోళనగా కారులో  కూర్చుని ఉంది. కొద్ది సేపటికే, ఆ మనిషి మహిళపై దాడి చేయడం మొదలుపెట్టాడు.

ఆమెపై దాడి చేస్తూ బూతులు తిట్టడం స్టార్ట్ చేశాడు. ఈ షాకింగ్ దృశ్యాలను తోటి వాహదారుడు గమనించాడు. ఆ తర్వాత వీడియో రికార్డ్ చేయడం మొదలు పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత కారు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే ఈ కారు ఎక్కడ ఉందో ఎక్సాక్ట్ లొకేషన్ చెబుతూ ఆ వీడియోను సదరు వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.  ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ హ్యాండిల్ ట్యాగ్ చేస్తూ ఆడవాళ్లను కాపాడాలంటూ కోరాడు కానీ ఇంతవరకు పోలీసులు రెస్పాండ్ కాలేదు. ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది మరోవైపు ఇలాంటి సంఘటన ముంబైలో మరొకటి చోటు చేసుకుంది.

గురువారం రాత్రి ముంబైలోని ఓషివారాలో ఒక మహిళను కొడుతున్నట్లు ఓ యువతి గమనించింది. ఆ తర్వాత నీకు ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగింది. దాంతో సదరు బాధితురాలు అవును అన్నట్లు తల ఊపింది. వెంటనే తన ఆటో రిక్షాలోకి బాధితురాలని ఎక్కించుకుంది.. ఆ తర్వాత కారు నుంచి ఆటో నేరుగా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళింది. దానిని ఫాలో అవుతూ వచ్చాడు ప్రియుడు. అయితే పోలీస్ స్టేషన్ వద్ద ఏ అధికారి సహాయం చేయలేదని, అసౌకర్య ప్రశ్నలు అడిగారని ఆమె చెప్పుకొచ్చింది. తర్వాత ఈ ఘటనపై ఏం పోలీసులు స్పందించారు. వీడియో తీయడం ఒకరి ప్రైవసీకి భంగం అని, అందుకే తాము త్వరగా రియాక్ట్ కాలేకపోయామని చెప్పుకొచ్చారు. బాధితురాలికి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పారు. ఈ రెండు సంఘటనలోనూ పోలీసుల త్వరగా రియాక్ట్ రాకపోవడం చాలామందికి షాకిస్తోంది.





మరింత సమాచారం తెలుసుకోండి: