"ముఖేష్ అంబానీ".. చాలా చాలా బిజినెస్ మైండెడ్ పర్సన్ అని అందరు అంటుంటే జనాలు వినడమే.. ఫర్ ద ఫస్ట్ టైం ఆయన ఏంటో ఆయన బిజినెస్ స్ట్రాటజీలు ఏంటో  ఇప్పుడు జనాలుకు అర్థమైపోయాయి . ఆఫ్ కోర్స్ ఇప్పటికే చాలా చాలా ఆయనకు సంబంధించిన బిజినెస్లకి రకరకాల ఆఫర్స్ పెట్టి కామన్ పీపుల్స్ కూడా కనెక్ట్ అయ్యేలా చేసుకున్నాడు.  బాగా అట్రాక్ట్ అయ్యేలా చేసిన ముఖేశ్ అంబానీ .. ఇప్పుడు ఏకంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్ తో ఒక పెద్ద ఆఫర్ తీసుకొచ్చారు.  ఫ్యాషన్ ఫ్యాక్టరీ ఎక్స్చేంజ్ ఫెస్టివల్ "మీ దగ్గర ఉన్న పాత బట్టలను మాకిచ్చి మా దగ్గర ఉన్న కొత్త బట్టలను మీరు తీసుకెళ్లండి" ఈ విధంగా రిలైన్స్  ఫ్యాషన్ ఫ్యాక్టరీ మీకోసం ఒక అవకాశాన్ని తెచ్చింది .


ముఖేశ్ అంబానికి చెందిన ఈ సంస్ధ ఫ్యాక్షన్ ఫ్యాక్టరీ ఎక్స్చేంజ్ ఫెస్టివల్ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా మీ దగ్గర ఉన్న పాత బట్టలు లేదా ఏదైనా బ్రాండెడ్ బట్టలు లేకపోతే అన్ బ్రాండెడ్ దుస్తులు ఏవైనా సరే మార్చుకోవచ్చు.  మీరు దానికి బదులుగా కొత్త బ్రాండెడ్ దుస్తులను తీసుకోవచ్చు.  లేదంటే దానికి సంబంధించిన కూపన్ ని మీరు మిగతా ఏ వస్తువులైనా కొనుగోలు చేసుకోవచ్చు.  మీ దగ్గర ఒక పాత బ్రాండెడ్ ప్యాంట్ ఉంది అనుకోండి ఆ బ్రాండెడ్ పాతప్యాంట్ ని ఫ్యాషన్ ఫ్యాక్టరీ ఎక్స్చేంజిలో రీప్లేస్ చేసుకొని ఒక కూపన్ ఇస్తారు .



ఆ కూపన్ కి సరిపడా డబ్బులకు మీరు కొత్త ప్యాంట్ అయిన కొనుక్కోవచ్చు .. లేకపోతే దానికి సంబంధించిన అమౌంట్ కి మీరు ఏవైనా ఇంటికి సరిపడా సామాన్లు అయినా కొనుక్కోవచ్చు..  ఇలాంటి ఒక సరికొత్త ఆఫర్ ని తీసుకొచ్చింది ఫ్యాషన్ ఫ్యాక్టరీ ఎక్స్చేంజ్ ఫెస్టివల్ . ఈ ఎక్స్చేంజ్ ఫెస్టివల్ ముఖ్యంగా రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకొని ప్రారంభించబడినట్లు చెప్తున్నారు . తద్వారా ప్రజలు పండుగకు కొత్త బట్టలు వేసుకోగలుగుతారు .. బడ్జెట్లోనే బట్టలు వేసుకోగలుగుతారు .. ఇంట్లో మూల పడిపోయిన పాత బట్టలన్నీ కూడా మీకు చికాకులు తెప్పించవు అంటూ సరి కొత్తగా ప్రమోషన్స్ చేసుకుంటున్నారు.  ఈ ఆఫర్ జూలై 20 వరకు అన్ని రిలైన్స్ ఫ్యాషన్ ఫ్యాక్టరీ స్టోర్ లలో అందుబాటులో ఉంటుంది అన్న విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. ఫ్యాషన్ ఫ్యాక్టరీ  ఏమైనాప్పటికీ పెద్ద బ్రాండ్లపై భారీ తగ్గింపులకు ప్రసిద్ధి చెందింది.  ఇక ఇప్పుడు ఎక్స్చేంజ్ కూడా పెట్టడంతో జనాలు ఎగబడి ఎగబడి షాపింగ్ చేస్తున్నారు. ముఖేశ్ అంబానీ కి ముఖేష్ అంబానీ బిజినెస్ మైండ్ కి ప్రతి ఒక్కరు హ్యాట్సాఫ్  చెప్పేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: