
అందుకే ఊరిలో ఎవరికైనా పులస కూర వండి ఉంటే, ఆ వార్త చుట్టుపక్కల వాళ్లంతా షేర్ చేసుకుంటారు. పులసల రేర్ నెస్ చూసి కొందరు ఇప్పటికే అడ్వాన్స్‌లో డబ్బులు కూడా ఇచ్చేస్తున్నారు. అమలాపురానికి చెందిన ఓ బడా వ్యాపారి బోడసకుర్రు గ్రామంలో అమ్మకానికి వచ్చిన మత్స్యకార మహిళల చేత ముందుగానే రూ.5వేలు డిపాజిట్ చేశాడట. పులస వచ్చిందంటే ముందుగా తనకే ఇవ్వాలని. అలానే అల్లవరం మండలం రెబ్బనపల్లికి చెందిన చేపల వ్యాపారి సాయికి నేతలు, అధికారులు ఫోన్‌లోనే ఆర్డర్ చేస్తారట. పులసను బహుమతిగా పంపించేందుకు కష్టపడే స్థితి ఇది. కాని గతకొన్నేళ్లుగా పులస ఉత్పత్తి తగ్గిపోతుండటంతో ఇది డబ్బున్నవాళ్లకు మాత్రమే అందే రుచిగా మారుతోంది.
బంగాళాఖాతంలో పెరుగుతున్న కాలుష్యం వల్ల పులసల మార్గం మారినట్లు భావిస్తున్నారు. గోదావరి ప్రవాహాన్ని వదిలి, ఇతర జల ప్రవాహాల వైపు తలంపు మళ్లించినట్లు మత్స్య శాఖ అంచనా. ఈ కారణంగా పులసల వేటలోని ఆదాయం కూడా జాలర్లకు తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మత్స్యకారులకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పులసల పునరుత్పత్తి, జలవనరుల పరిరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం తీవ్రంగా కనిపిస్తోంది. ఎప్పటికైనా.. ఒక వాసన ఊహల్లోకి లాక్కెళ్లేలా చేస్తే అది పులస కూరే అవుతుంది! ఈ సీజన్ లో ఒక్కసారి తిన్నాక మళ్లీ మరిచిపోలేరు అనడం మాత్రం నిజం!