
ఈ నగరంలో వాహనాల సంఖ్య కూడా భారీగానే పెరిగిపోతుంది . సుమారు 85 లక్షలు దాటేసినట్లు తెలుస్తుంది . ఫలితంగా ట్రాఫిక్ సమస్య రోజురోజుకీ మరింత తీవ్రంగా మారుతుంది . ఉద్యోగం - విద్య కోసం వెళ్లే ప్రజలు గంటలు కొద్ది ట్రాఫిక్ లో ఇరుక్కుకోవాల్సిన పరిస్థితి. మెట్రో అందుబాటులోకి వచ్చిన ఇంకా సగానికి పైగా ట్రాఫిక్ సమస్యలు తీరలేదు. ఇలాంటి క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుకు ప్రణాళికలు తీసుకొచ్చింది. పర్యాటకశాఖ యూనిఫైడ్ మెట్రోపాలిటీ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సంయుక్తంగా రూపొందించిన ప్రతిపాదన ప్రకారం హైదరాబాద్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో ఇది ఏర్పాటు చేయనున్నారు.
అధికారులు మొదటి దశలో భాగంగా గోల్కొండ కోట నుంచి కుతుబ్షాహీ టూంబ్స్ వరకు నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది . ఆ తర్వాత ట్యాంక్ బండ్ .. సంజీవయ్య పార్క్ వద్ద కూడా ఈ సదుపాయాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. రోప్ వేలు గా తీగలపై నడిచే బాక్స్ ఆకారపు వాహనాలు ఏర్పాటు చేయనున్నారు . ఒక్కొక్క బాక్స్ లో సుమారు 6 నుంచి పదిమంది వరకు ప్రయాణించవచ్చు . ఇది పూర్తిగా సురక్షితం . దీంతో ట్రాఫిక్ ను కొంచెం అయినా తగ్గించొచ్చు అనేది అధికారుల అభిప్రాయం . ఒకే సమయంలో చారిత్రాత్మక ప్రదేశాలను సులభంగా సందర్శించుకోగలరు ఈరోప్ వే ద్వారా అంటూ కూడా అధికారులు చెబుతున్నారు . మరీ ముఖ్యంగా గోల్కొండ - కుతుబ్షాహీ టూంబ్స్ వంటి ప్రదేశాల మధ్య ప్రయాణం గాల్లోనే తేలికగా పూర్తవుతుంది..!!