ఒకప్పుడు KPHB అంటే హైదరాబాద్‌లోని టాప్ మోస్ట్ బిజీ ఏరియాగా, అక్కడ నివసించే వారు చాలా రిచ్, అలాగే వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అని ఒక నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం KPHB కాలనీ పేరు చెబితేనే “అమ్మో బాబోయ్... మాకు వద్దు” అనేలా జనాలు మాట్లాడుకుంటున్నారు. దానికి ప్రధాన కారణం అక్కడ వేశ్యావృత్తి ఎక్కువగా ఉండటమే. రాత్రి 9:30 దాటితే చాలు, KPHB బస్ స్టేషన్, జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర అమ్మాయిలు వరుసగా నడుస్తూ అటు పోయే వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. హైదరాబాద్‌లో వేశ్యను బుక్ చేసుకోవాలంటే KPHB బస్ స్టాప్ లేదా మెట్రో స్టేషన్‌కి వెళ్లమని ఓపెన్‌గా చెప్పే స్థాయికి వెళ్లిపోయింది.


ఇటీవల ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి అక్కడ జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేశ్యను బుక్ చేసుకోవడానికి అతను KPHB కి వెళ్లాడు. రేటు విషయంలో తేడా రావడంతో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. వెంటనే ఆ మహిళ తన మరిదికి కాల్ చేయగా, అతని అనుచరులు అక్కడికి చేరుకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై దాడి చేశారు. కత్తితో దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వేశ్యా తరుపున ఉన్న అనుచరులు, అలాగే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకున్నారు.



ఈ ఘటనల కారణంగా ఖ్ఫ్భ్ వాసులు భయాందోళనలో జీవిస్తున్నారు. రాత్రి పది దాటితే పిల్లలను బయటకు తీసుకెళ్లడానికే భయపడుతున్నారు. ముఖ్యంగా మెట్రో స్టేషన్ పరిసరాలు అసలు సురక్షితం కాదని భావిస్తున్నారు. కొందరు వేశ్యలు బహిరంగంగా తిరుగుతున్నా పోలీసులు చూసి చూడన్నట్లు వదిలేస్తున్నారని.. కళ్ల మీద కునుకు లేకుండా చూస్తూనే ఉన్నారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రత్యేకంగా రాత్రి సమయాల్లో ఇంటికి చేరుకునే మహిళలు, అలాగే డీసెంట్ ఫ్యామిలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ సమస్యను వెంటనే అరికట్టాలని KPHB వాసులు పోలీసులను కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: