గ్రామం నుండి వచ్చిన మురళీధర్ రావు ఇప్పుడు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఫైనాన్స్ విభాగంలో చీఫ్ జనరల్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మురళీధర్ రావు తండ్రి కూడా పెద్ద కొడుకు చనిపోయినా అధైర్య పడకుండా చిన్న కొడుకుకి అన్ని విధాలా ధైర్యాన్ని ఇస్తూ వచ్చాడు. చిన్నప్పటి నుండి చదువులో ఎప్పుడూ ముందే ఉండేవాడు. ఆ తరువాత బి టెక్ లో సీటు సంపాదించి చదువును పూర్తి చేసాడు. అదే ఊపులో ఎం ఇ కూడా పూర్తి చేసాడు. సింగరేణిలో మొత్తంగా 30 సంవత్సరాలు వివిధ శాఖల్లో ఉద్యోగం చేశాడు.