చదువుకునే చాలా మంది విద్యార్థుల్లో కామన్ గా ఒక సమస్య ఉంటుంది. అదేమిటంటే విద్యార్థులు ఒక అంశాన్ని చదివే సమయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ విషయం గురించి పరీక్షల్లో రాయాల్సి వస్తుందో అప్పుడు అది గుర్తుకు రాదు. తద్వారా కొన్ని సమయాల్లో పరీక్షల్లో తప్పుతుంటారు. ఈ సమస్యకు ప్రధాన కారణం జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం.