ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా నుండి కోలుకుని మళ్లీ సాధారణ జీవితానికి అలవాటు పడి పోయారు. అయితే ప్రపంచం ఉన్నంత కాలం మరియు మనుషులు బ్రతికి ఉన్నంత కాలం బ్రతకడానికి కనీస అవసరాలు ముఖ్యం. వాటిలో ఉద్యోగం అనేది కీలకమైనది. కాగా ప్రతి ఒక్కరూ ఉద్యోగంలో స్థిరపడడానికి అవకాశం ఉండదు. కానీ ఎలాగోలా బ్రతకాలి కాబట్టి ఎవరి స్థాయికి తగినట్లుగా వారు చిన్న చిన్న ఉద్యోగాలతో తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ చాలా మందికి ఉద్యోగం అంత సులభంగా దొరకదు.