కరోనా వైరస్ పుణ్యమా అని ఒక విద్యా సంవత్సరం వృధా అయిపోయింది. కొన్ని విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులు పెట్టినా, వీటి వలన అంత ఉపయోగమయితే జరగలేదన్నది కొంత మంది అభిప్రాయం. దీనికి ప్రధాన కారణం కొన్ని ప్రాంతాలలో ఇంటర్ నెట్ సౌకర్యం లేకపోవడం మరియు కొన్ని ప్రాంతాలలో సౌకర్యం ఉన్న ఆ విద్యార్థికి అంత స్థోమత లేక పోవడం ఇలా ఎన్నో కారణాలున్నాయి.