ఎంతో సంతోషంగా సాగిపోతున్న జీవితాలలో హఠాత్తుగా ఒక వైరస్ వచ్చి మన జీవితాలను కుదిపేసింది. అది మరేదో కాదు కరోనా వైరస్ అనే ఒక ప్రపంచ విపత్తు. దేని వలన నష్టాన్ని లెక్క వేయలేము. కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళ్ళిపోయాము. జీవితం అనూహ్యమైనది. జీవితంపై ఎవ్వరికీ పూర్తి నియంత్రణ ఉండదు. మానవుడు ఎన్నెంన్నో సృష్టించగలడు, మరియు నాశన చేయగలడు. కానీ చాలా మంది మంచి కోసం అభివృద్ధిని శాస్త్రీయతను ఉపయోగించరు. ప్రపంచ వినాశనానికి మాత్రమే ఇలాంటి అభివృద్ధిని టెక్నాలజీ ని ఉపయోగిస్తారు.