మనిషిగా మనం పుట్టాక అన్నింటికీ సిద్దపడి ఉండాలి. మనము ఎప్పుడూ సుఖాల్లో ఉండము. అలాగే మనతో ఎప్పుడూ కష్టాలు అంటుకుని ఉండవు. అందుకే ఎప్పుడూ సుఖాలకే అలవాటు పడిపోయి దుఃఖం వచ్చినప్పుడు తప్పించుకుని తిరిగితే, మీ జీవితంలో మీకు తెలిసే చాలా తప్పులు చేసేస్తారు. అందుకే అప్పుడప్పుడయినా మీ జీవితంలో వచ్చిన దుఃఖాన్ని భరించి, చేసిన తప్పులని తెలుసుకుంటే మళ్ళీ ఆ తప్పు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.