తల్లిదండ్రుల జీవితంలో పిల్లల పెంపకం అనేది అతి ప్రధానమైన అంశం. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉన్నత స్థాయిలో చూడాలని ఆశపడతారు. వారి భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తారు. అందుకు కావలసిన మార్గాన్ని ఏర్పాటు చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ తమ జీవితమంతా ధారపోస్తారు ఇది జగమెరిగిన సత్యం.