ప్రతి ఒక్కరూ బ్రతకడానికి జీవనోపాధి అనేది ఎంతో ప్రదానం. చిన్నదైనా పెద్దదైనా ఎదో ఒక పనో, ఉద్యోగమో, వ్యాపారమో చేయనిదే మన జీవితం గడవదు. ఇలా ప్రతి ఒక్కరికీ జీవనోపాధి తప్పనిసరి. ముఖ్యంగా ఎంతో మంది తమ చదువుకు తగ్గ ఉద్యోగాలు చేస్తూ జీవనం కొనసాగిస్తుంటారు. నేటి తరంలో ఉద్యోగమే చాలా అవసరం. అయితే చాలా మంది మొదటి సారి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాల్సి వచ్చినపుడు చాలా కంగారు పడిపోతుంటారు.