దేవుడు సృష్టించిన ప్రతి మనిషికి ఏదో ఒక కోరిక ఉండనే ఉంటుంది. కానీ కోరికలు అనేవి పరిమితంగా ఉండాలి. మన అర్హతకు, తాహతుకు మించి ఉంటే అవి మనకు లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం లేకపోలేదు. మనసును కంట్రోల్ చేసుకోలేనప్పుడు కోరికలు కూడా అంతకంతకూ పెరిగి పోతూనే ఉంటాయి.