ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత గర్వం ఉంటుంది అది సహజమే. కానీ ఆ గర్వం యొక్క మోతాదు మించినప్పుడే మనిషి కష్టాలలో పడతాడు, సమస్యల వలయంలో చిక్కుకుని ఇబ్బంది పడతాడు. కాబట్టి మనపై మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు.