కరోనా కారణంగా అందరి జీవితాలు తలకిందులైపోయాయి. రోజు వారి కూలీకి పని లేక అల్లాడుతున్నాడు. చిరు వ్యాపారి వ్యాపారం చేసుకునే అవకాశం లేక ఇబ్బంది పడుతున్నాడు. సగటు మధ్యతరగతి ఉద్యోగి కంపెనీ క్లోజ్ అవడంతో కుటుంబాన్ని పోషించుకోలేక సతమతమవుతున్నాడు. ఇవన్నీ ఒక బాధయితే నేటి బాలలే రేపటి పౌరులు అని మనము ఎప్పటి నుండో చెబుతూ వచ్చిన బాలల పరిస్థితి ఇంకా దారుణం.