ప్రతి మనిషికి తమ తమ నిత్య జీవితంలో ఎన్నో సుఖ దుఃఖాలు ఎదురవుతుంటాయి. ఇది ప్రతి మనిషి జీవితంలో జరిగేదే. ఏ చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎంత సంపన్నులైన సరే వారికి తగ్గ బాధలు వారికి ఉండనే ఉంటాయి. అయితే చాలా మంది సాధారణంగా ఏమని భావిస్తారు అంటే పేద వారికి మాత్రమే కష్టాలు ఉంటాయి అని, వారి జీవితంలో సుఖాలకు అస్సలు చోటే ఉండదని అని అనుకుంటుంటారు.