సాధారణంగా అందరికీ కోపం వస్తుంది. ఇది అందరిలోనూ సహజం... కానీ కోపానికి కూడా హద్దులు ఉండాలి లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కట్టలు తెంచుకునే కోపం వలన కొంప మునిగే పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు. ఎందుకంత కోపం.. అసలు కోపానికి కారణాలేమిటి.. అన్న అంశానికి గల కారణాలను అన్వేషిస్తే... దిగులు అసూయ, అవమానం, అసహ్యం, ఆతృత, భయం, ఓర్పు లేకపోవడం, అసంతృప్తి, ఒంటరితనం, ఇవన్నీ కోపానికి కారణమయ్యే అంశాలుగా తెలుస్తున్నాయి..

ఇలా ఎన్నో రకాల విషయాలు మనిషిని ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. తన కోపమే తన శత్రువు అని పెద్దలు అంటుంటారు. ఇది అక్షర సత్యం. నియంత్రించుకోలేనంతటి  కోపం రావడం వల్ల ఆరోగ్యానికి పలు విధాలుగా నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు వైద్యులు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. చాలా కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉండడం వలన.... చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా చిరాకు పడుతూ ఉండడం వలన మనసు ప్రశాంతంగా ఉండదు.. నిద్రలేమి ఏర్పడుతుంది. దీని వలన మన నిత్యజీవితంలో జరగాల్సిన కార్యక్రమాలు సరిగా నిర్వర్తించలేక పోతాము.

అతి ముఖ్యమైన విషయం మన గుండె మీద పెరిగే ఒత్తిడి... నియంత్రించలేని అంత కోపం ఒత్తిడిని అమాంతం పెంచేస్తుంది. దీని  ప్రభావాల వల్ల గుండె జబ్బులకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోపంగా వున్నప్పుడు రక్తపోటు బాగా ఎక్కువవతుంది... అంత ఒత్తిడిలో మనం ఏం చేస్తామో మనకే తెలియదు ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. కోపం కారణంగా శరీర కండరాలపై ఒత్తిడి పెరిగి, తలనొప్పి, నడుమునొప్పి, కాళ్లులాగడం, ఒళ్లు నొప్పులు, మెడనొప్పి వంటి సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి మీ జీవితంలో వీలైనంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. కోపం తెచ్చుకున్నంత మాత్రాన సమస్యలు తీరిపోవు. మీ జీవితంలో ఎంత ఆనందంగా ఉంటే అంత మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: