ఆటిజం అనే అరుదైన వ్యాధి గురించి పెద్దగా ఎవరికీ తెలిసుండకపోవచ్చు, అవగాహన ఉండకపోవచ్చు. అయితే ఈ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులకు మాత్రం ఇదో ప్రత్యక్ష నరకం. మానసిక ఎదుగుదల లేని తమ పిల్లల ప్రవర్తన చూసి కృంగిపోతుంటారు ఆ తల్లిదండ్రులు.