మానవునిగా పుట్టినందుకు కష్ట సుఖాలు సహజం. అయితే కొంతమంది కష్టానికి లొంగిపోయి అనుకున్న పనులు సాధించకుండా వెనుతిరుగుతారు. మరి కొందరు కొంచెం కష్టమయినా పర్వాలేదు, ప్రయత్నించి విఫలమవుతారు. అయితే కొంతమంది కేవలం విజయం కోసమే పుడతారు. విజయం సాధించే వరకు నిద్రపోరు..వెనుతిరగరు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు.