క్యారట్ : 10 గ్రా బీన్స్ : 5 గ్రా బంగాళదుంప : 10 గ్రా పనీర్ : 10 గ్రా పచ్చిబఠాణీ : 10 గ్రా నూనె : తగినంత పాలకూర పేస్ట్ : 100 గ్రా జీడిపప్పు పలుకులు : 5 గ్రా మిరప్పొడి : అర టీ స్పూను జీలకర్ర పొడి : అర టీ స్పూను మెంతిపొడి : అర టీ స్పూను గ్రీన్ కలర్ : రెండు మూడు చుక్కలు ఉప్పు : తగినంత  గార్డెన్ వెజ్ తయారి: కూరలన్నిటినీ శుభ్రంగా కడిగి తొక్క తీసి క్యూబ్ సైజులో ముక్కలు కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తరవాత ఒక బాణలిలో నూనె వేసి అందులో ఈ కూర ముక్కలను దోరగా వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె, నెయ్యి వేసి కాగిన తరవాత అందులో పాలకూర పేస్ట్ వేసి బాగా వేయించాలి. తరవాత మిరప్పొడి, జీలకర్రపొడి, మెంతిపొడి, గ్రీన్ కలర్, ఉప్పు వేసి బాగా కలపాలి. వేయించుకున్న కూరముక్కలు వేసి బాగా కలిపిన తరవాత ఉప్పు వేసి మరోమారు కలిపి దానిని గిన్నెలోకి తీసుకోవాలి.చివరగా చీజ్ తురుము వేసి గార్నిష్ చేసుకోవాలి  

మరింత సమాచారం తెలుసుకోండి: