కావలసిన పదార్థాలు: పాంప్రెట్ ఫిస్ ఫిల్లెట్: 4 అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి: 1 టీ స్పూన్ కారం: 1 టీ స్పూన్ ధనియాల పొడి: 1టీ స్పూన్ పసుపు: 1 తగినంత అజ్వైన్(ఇంగువ): 1/2 టీ స్పూన్ నిమ్మరసం: 2  టేబుల్ స్పూను  నూనె: 1 టేబుల్ స్పూన్  ఉప్పు: రుచికి సరిపడా కొత్తిమీర తరుగు: 2 టేబుల్ స్పూన్   తయారు చేయు విధానం: 1. ముందుగా ఓవెన్ ను 300డిగ్రీల వరకూ వేడి చేయాలి. 2. తర్వాత ఫిష్ ఫిల్లెట్ ను శుభ్రం చేసి తడి ఆరనివ్వాలి. శుభ్రం చేసిన ఫిష్ ఫిల్లెట్ మీద ఉప్పు, పసుపు చిలకరించు పక్కన పెట్టుకోవాలి. 3. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ధనియాలపొడి మరియు జీలకర్రపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. 4. ఇప్పుడు శుభ్రం చేసి ఉప్పు పట్టించి పెట్టుకొన్న ఫిష్ ఫిల్లెట్ ను ఈ అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని మ్యారినేట్(చేపమొత్తానికి బాగా పట్టించాలి)చేసి దాని మీద కొంచె అజ్వైన్ మరియు నిమ్మరసం చిలకరించి ఇరవై నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 5. ఇరవై నిముషాల తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకొన్ని ఫిష్ ఫిల్లెట్ మీద నూనెను చిలకరించి ఓవెన్ గ్రిల్లింగ్ రాక్ మీద పెట్టాలి. 6. 60డిగ్రీల హీట్ పెట్టి 15-20నిముషాల పాటు ఫిఫ్ ను గ్రిల్(బేక్) చేయాలి. మద్య మద్యలో ఫిష్ ను అన్ని పక్కలకూ తిప్పుతూ బాగా కాలేలా చూసుకోవాలి. అంతే గిల్డ్ మసాలా ఫిస్ ఫిల్లెట్ తయారైన వెంటనే కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: