కావలసిన పదార్థాలు : పన్నీర్ తురుము : 225 గ్రాములు పంచదార : వంద గ్రాములు పాలు : ఒక కప్పు రోజ్ వాటర్ : ఒక కప్పు ఏలకుల పొడి : అర స్పూన్ పిస్తా : ఒక కప్పు తయారీ విధానం: ముందుగా పన్నీర్, పాలు, పంచదారను ఒక పాత్రలో వేసి బాగా కలుపుకోవాలి. గట్టిపడిన ఈ మిశ్రమంలో కాస్త రోజ్ వాటర్, ఏలకుల పొడిని చేర్చాలి. ఒక ప్యాన్‌లో పిస్తా ముక్కలను చల్లి, పన్నీర్, పాలు, పంచదార మిశ్రమాన్ని దానిపై వేసి, కాసేపు ఆరనివ్వాలి. కాసేపయ్యాక ఈ పిస్తా సంతోష్‌ను మీకు ఇష్టమొచ్చిన సైజుల్లో కట్ చేసుకుని సర్వ్ చేయొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: